ఉపాధి హామీ కూలీలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు  

తుగ్గలి ముచ్చట్లు :

 

తుగ్గలి మండలంలోని ఉపాధి హామీ కూలీలకు అధికారుల సమక్షంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.మంగళవారం రోజున జొన్నగిరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు వైద్య శాఖ ఉద్యోగులు చేశారు.ఈ సందర్భంగా  ఎంపీడీవో వీర్రాజు మాట్లాడుతూ ఉపాధి కూలీలు అందరూ ఒకే చోట ఉండి పనులు నిర్వహించడం వలన వారిలో ఎవరికైనా వైరస్ ఉంటే అందరికీ వచ్చే ప్రమాదం ఉందని,దీంతో గ్రామానికి మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అందువల్ల ప్రతి ఒక ఉపాధి కూలీ తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని  ఆయన కోరారు.ప్రతి ఒక్కరు కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలియజేసారు.45 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా వాక్సిన్ ను తప్పక వేయించుకోవాలని వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్  ఓబులేసు,ఏపీఓ రామకృష్ణ ,పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి, విఆర్వో వెంకట రమణా రెడ్డి,హెల్త్ కార్యదర్శి పద్మావతి, వైయస్సార్ క్రాంతి పథకం కోఆర్డినేటర్ రవి కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ సుంకప్ప,ఆశా కార్యకర్తలు,సచివాలయ ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Kovid diagnostic tests for employment guarantee workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *