కర్నూలులో కోవిడ్ వ్యాక్సినేషన్

Date:16/01/2021

కర్నూలు ముచ్చట్లు:

శనివారం  ఉదయం ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  వీడియో కాన్ఫరెన్స్ తరువాత రం, కర్నూలు నగరం జిజిహెచ్ ఓల్డ్ గైనిక్ ఓపి సెంటర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో తొలి విడతలో హెల్త్ వర్కర్స్ కు టీకా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాంలొ   జిల్లా కలెక్టర్  జి.వీరపాండియన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కె బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, జిజిహెచ్ పర్యవేక్షకులు డా.నరేంద్రనాథ్ రెడ్డి, కె.ఎం.సి కళాశాల ప్రిన్సిపాల్ డా.జిక్కి, డిఎంహెచ్ఓ డా.రామ గిడ్డయ్య, డి ఐ ఓ డా.విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో తొలిసారిగా.. తొలివిడతలో కర్నూలు జిజిహెచ్ సీఎస్ ఆర్.ఎం.ఓ డా.హేమనళిని.,స్టాఫ్ నర్స్ సరళ కుమారి కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా.. తొలివిడత కోవిడ్ వాక్సిన్ ప్రోగ్రాం హెల్త్ వర్కర్స్ కు 27 టీకా కేంద్రాల ద్వారా ఒక్కో టీకా కేంద్రంలో రోజుకు 100 మంది చొప్పున ..వారంలో 4 రోజుల పాటు విజయవంతంగా టీకా కార్యక్రమం ఈ రోజు మొదలు అయింది..ప్రతి టీకా కేంద్రానికి ఒక జిల్లా అధికారిని టీకా స్పెషల్ ఆఫీసర్ గా నియమించాము..ఎటువంటి అపోహలు వద్దు..సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా వచ్చినా వెంటనే తగు చికిత్స చేయడానికి అన్ని సిద్ధం..ధైర్యంగా వాక్సిన్ వేయించుకోండని అన్నారు.

 

 

జిల్లాకు 40,500ల డోసుల కోవిడ్ వాక్సిన్ వచ్చింది.. ఈ రోజు ప్రారంభం రోజున జిల్లా వ్యాప్తంగా 27 టీకా కేంద్రాల ద్వారా 2700 ల మందికి టీకా వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో తొలి విడతలో 35470 మంది హెల్త్ వర్కర్స్ కు 147 టీకా కేంద్రాల ద్వారా వారంలో 4 రోజులు ..కోవిన్ యాప్ లో నమోదు అయి ఎస్.ఎం.ఎస్ వచ్చిన వారికి మాత్రమే కోవిడ్ టీకా..18 సంవత్సరాల లోపు ఉన్న వారికి, గర్భిణీ, బాలింతలకు టీకా వేయరని అన్నారు. రెండవ విడతలో 4 శాఖల ఫ్రంట్ లైన్ సిబ్బంది 47037 మందికి 199 టీకా కేంద్రాల ద్వారా, మూడవ విడతలో 1531 టీకా కేంద్రాల ద్వారా 5, 57, 080  మంది 50 సంవత్సరాల వయసు దాటిన, 50 సంవత్సరాల లోపు కోమార్బిడ్ జబ్బులతో బాధపడుతున్న సాధారణ ప్రజలకు కోవిడ్ టీకా  ఇస్తామని  కలెక్టర్  అన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Kovid vaccination in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *