చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 29 ఆసు పత్రులలో కోవిడ్ వ్యాక్సినే షన్ ప్రారంభం

– కోవిడ్ వ్యాక్సినేషన్ కు జిల్లా యంత్రాంగం సన్న ద్ధం: ఇంచార్జి కలెక్టర్

Date:16/01/2021

చిత్తూరు ముచ్చట్లు:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 16న మొద టి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సి నేషన్ కు  జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నదని ఇం చార్జి కలెక్టర్ డి. మార్కండే యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 16 న ఉదయం 10:30 గంటలకు గౌ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు,గౌ. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కోవిడ్ వాక్సినేషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 న  తొలిసారిగా .. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రకియ ప్రారం భమవుతుందన్నారు.జిల్లాలో ఈనెల 16 నుండి మొదటి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గానికి రెండు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు  చొప్పున జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాల యందు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని మొదటి విడతలో భాగంగా హెల్త్ కేర్  వర్కర్లకు వ్యాక్సినే షన్ చేసేందుకుఏర్పాట్లు చేశామని ఇప్పటికే 37,703 మందిని మొదటి జాబితా లో సిద్ధం చేయడం జరిగిం దని తెలిపారు. జిల్లాకు 41,500 డోసులు వ్యాక్సిన్ అందడం జరిగిందని, ప్రతి సెంటర్ నందు రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ చేయ డం జరుగుతుందని తెలి పారు.

 

తిరుపతి స్విమ్స్,రుయా ఆసుపత్రులలో గౌ. ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నులు శాఖ మాత్యులు కె.నారా యణ స్వామి,గౌ.రాష్ట్ర పం చాయతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తారని తెలిపారు.రెండో విడతలో పోలీసు, రెవిన్యూ, మున్సిపాలిటీ పంచాయతీరాజ్ శాఖకు చెందిన వారికి, మూడో విడతలో ప్రతి సచివాలయం నందు, ఆరోగ్య కేంద్రాల యందు సాధారణ ప్రజలు 50 సంవత్సరాలు పైబడిన వారికి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కోమార్బడ్ తో బాధపడు తున్న వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు .వ్యాక్సినేషన్ అనంతరం సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ప్రతి కేంద్రం నందు తగిన వైద్య సదుపా యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Kovid vaccination started in 29 hospitals across Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *