ఆరు రోజులో పది లక్షల మందికి కోవిడ్ టీకా

Date:22/01/2021

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా గురువారం వరకు పది లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్‌ టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గురువారం ఒకే రోజు 2,33,530 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరవ రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ తెలిపారు. తాత్కాలిక నివేదిక ప్రకారం టీకా ప్రారంభం నుంచి గురువారం వరకు 10,40,014 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ రోజు నుంచి ఇమ్యునైజేషన్‌ (ఏఈఎఫ్‌ఐ) తర్వాత 187 ప్రతికూల సంఘటనలు నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 20న ఇంట్రాక్రానియల్ హెమరేజ్ లక్షణాలు అభివృద్ధి చేసిన వ్యక్తిని రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని గీతాంజలి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్పించినట్లు చెప్పింది. అయితే టీకాకు, హెమరేజ్‌కు సంబంధం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కొవిన్‌ యాప్‌లో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నట్లు చెప్పింది.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Kovid vaccine for one million people in six days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *