పుంగనూరులో 20న సచివాలయాలలోను కోవిడ్‌ వ్యాక్సిన్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలోని 16 సచివాలయాల పరిధిలోను కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ప్రభుత్వాదేశాల మేరకు ఐదు సంవత్సరాల పిల్లలు కలిగిన తల్లులు ఖచ్చితంగా వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. మూడవ సారి కరోనా చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని, పిల్లల్లో ఇమ్యూనిటి పెంచుకోవాలన్నారు. అలాగే వృద్ధులు తప్పకుండ కరోనా వ్యాక్సిన్‌ చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటిలోని అన్నిశాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

లాక్‌డౌన్‌ సడలింపు…

పట్టణంలో ఈనెల 21 నుంచి లాక్‌డౌన్‌ వేళలను సడలించినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. 5 గంటల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

 

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Kovid vaccine in the secretariat on the 20th in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *