కోవిడ్ వ్యాక్సిన్ రెఢీ

Date:13/01/2021

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ అంతా రెడీ అయ్యింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పుణె నుంచి గన్నవరంకు.. అక్కడి నుంచి మళ్లీ జిల్లాలకు వ్యాక్సిన్ బాక్సులు తరలించారు. వ్యాక్సిన్‌ను నిల్వ చెయ్యడానికి అవసరమైన స్టోరేజ్ ఏర్పాట్లు చేసి అక్కడ బాక్స్‌లను ఉంచారు. వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది తొలి విడతగా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ టీకాలు వేస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా 3,87,983 మందిని గుర్తించారు. వైద్యారోగ్య శాఖ జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసిందికోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకునేవారికి యాప్‌ ద్వారా మెసేజ్‌లు పంపారు. జిల్లాల వారీగా కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకునేవారి జాబితాను పరిశీలిస్తే. శ్రీకాకుళంలో 21,934.. విజయనగరంలో 17,465.. విశాఖపట్నంలో 36,694.. తూర్పు గోదావరిలో 38,128.. పశ్చిమగోదావరిలో 27,323.. కృష్ణా జిల్లాలో 34,813.. గుంటూరు జిల్లాలో 35,389.. ప్రకాశం జిల్లాలో 25,383.. నెల్లూరు జిల్లాలో 31,346.. చిత్తూరు జిల్లాలో 33,773.. అనంతపురం జిల్లాలో 29,065.. కడప జిల్లాలో 23,391.. కర్నూలు జిల్లాలో 33,279 మందిని గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్‌ తీసుకునేవారు ఉన్నారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Kovid Vaccine Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *