కోవిడ్ బాధితులను ఆదుకోవాలి  టిడిపి నాయకుల ఆందోళన

నెల్లూరు    ముచ్చట్లు:
కోవిడ్ మహమ్మారి మూలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవిడ్ తో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్  కారణంగా కనీసం జీవనోపాధి కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య , మాజీ కార్పొరేటర్ పిట్టి సత్య నాగేశ్వరరావు, ముస్లిం మైనార్టీ నాయకులు సాబీర్ ఖాన్, మహిళా నాయకురాలు రేవతి, సీనియర్ రాజకీయ నాయకులు కప్పిర శ్రీనివాసులు, మాలమహానాడు నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Kovid victims need to be supported
Concern of TDP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *