పుతిన్‌కు గుండెపోటు వార్తలను ఖండించిన క్రెమ్లిన్..
న్యూ డిల్లీ ముచ్చట్లు:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం పై మరోసారి వదంతులు షికార్లు చేస్తున్నాయి. పుతిన్ గుండెపోటుకు గురయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది. అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది.ఇక ఇదే సమయంలో పుతిన్ తనలాంటి మరో వ్యక్తిని డూప్‌గా ఉపయోగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలే అని కొట్టిపారేశారు. 2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుతిన్.. తన డూప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. అవన్నీ అవాస్తవాలే అని అప్పట్లో స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా గతంలో ఒకసారి డూప్‌ను ఉపయోగించుకున్నట్లు వివరించారు.

Tags: Kremlin denies reports of Putin’s heart attack
