కృష్ణా జిల్లా మినీ మహానాడుకు.. భారీ ఏర్పాట్లు

విజయవాడ ముచ్చట్లు:


కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో తెలుగుదేశం తలపెట్టిన మినీ మహానాడు సభా వేదిక ప్రాంతంలో ఆ పార్టీ నేతలు శుక్రవారం భూమి పూజ చేశారు.  మహానాడును విజయవంతం చేసి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం సత్తా ఏమిటో చాటుతామని అన్నారు.   గన్నవరం విమానాశ్రయం నుంచి పార్టీ అధినేత చంద్రబాబు ప్రయాణించే రోడ్డు మార్గాన్ని పసుపుమయం చేస్తామని తెలిపారు.   గుడివాడలో చంద్రబాబు రోడ్షోలో పాల్గొంటారని వెల్లడించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో జగనున్న ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రబాబు భరోసా కృష్ణాజిల్లా మహానాడు సభ వేదిక ఏర్పాటుకు టీడీపీ నాయకులు భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు.   పార్టీ కార్యకర్తలతో కలిసి సభావేదిక ఏర్పాట్లను టీడీపీ నేతలు ప్రారంభించారు.

 

Tags: Krishna District Mini Mahanadu .. Huge arrangements

Post Midle
Post Midle
Natyam ad