150 కోట్లతో కృష్ణా కరకట్టపనులు

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెబుతున్న జగన్ సర్కార్.. రాజధాని అమరావతి ప్రాంతంలో కీలక పనులకు పచ్చజెండా ఊపింది. విజయవాడ నుంచి అమరావతి సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే కృష్ణానది కరకట్ట విస్తరణకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకూ ఉన్న కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు.అమరావతి సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులు రూ.150 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. సుమారు 15.525 కి.మీ పొడవునా రోడ్డును రెండు వరుసల రహదారిగా నిర్మిస్తారు. రెండు వైపులా నడక దారులను సైతం నిర్మించనున్నారు. పది మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణ చేపడతారు. అలాగే కొండవీటి వాగు బ్రిడ్జి పునర్నిర్మాణం, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మించనున్నారు. కృష్ణా కరకట్ట రోడ్డును అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు విజయవాడ బైపాస్ రోడ్డుకు అనుసంధానిస్తారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Krishna handicrafts with 150 crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *