Natyam ad

 కృష్ణంరాజు సంస్మరణ సభ

నరసాపురం ముచ్చట్లు:


మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మొగల్తూరులో నిర్వహించారు. ఇప్పటికే కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు హీరో ప్రభాస్ అక్కడికి చేరుకున్నారు. అభిమానులు సైతం భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పటిష్టమైన పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అభిమానులకు భోజన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రభాస్ అభిమానుల్ని పలకరించాడు. లోపలికి వెళ్తూ.. భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ తినేసి వెళ్లండని చెప్పాడు. మరోవైపు.. భారీఎత్తున అభిమానులు రావడంతో కృష్ణంరాజు భార్య శ్యామల ఉద్వేగానికి లోనయ్యారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు, ఈనెల 11వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈయన మృతి పట్ల సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు.

 

 

 

కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్.. కృష్ణంరాజుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణంరాజు కడసారి చూసేందుకు.. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు..ఈ సంస్మరణ సభకు మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సినీ హీరో ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామల, కుమార్తెలు, ఆయన అభిమానులు హాజరయ్యారు. దాదాపు లక్ష మంది పైగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సభకు వచ్చే వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణం రాజు భోజన ప్రియుడు కనుక ఆయనకు ఇష్టమైన వంటకాలతో భారీగా వంటకాలను రెడీ చేశారు. 25 రకాల వంటకాలతో వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.  ముఖ్యఅతిథులకు కృష్ణం రాజు ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు.భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. రద్దీని నియంత్రించేందికు పోలీసులు సిబ్బందిని, వాలంటీర్లను నియమించారు.

 

Post Midle

Tags: Krishna Raja Memorial Assembly

Post Midle