కృష్ణ జలాలను లింగాల కుడికాల్వకు  విడుదల

Krishna waters are released to the right wing of Lingas

Krishna waters are released to the right wing of Lingas

Date:13/04/2018
కడప ముచ్చట్లు:
కరవు గడ్డ పై కృష్ణమ్మ బిరబిరా పరుగెడుతోంది. కృష్ణ జలాలను లింగాల కుడికాల్వకు  విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం అభివృద్ది తమ నేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు..పులివెందుల …రాయలసీమ జిల్లాలోనే అత్యంత కరవు ప్రాంతమైన ఈ గడ్డ పై జలాలు గలగలా పారుతుంటే రైతుల మోములు విప్పారుతున్నాయి. మొన్నటికి మొన్న పైడి పాలెం రిజర్వాయరుకు నీళ్ళు రాగా.. తాజాగా చిత్రావతి రిజర్వాయరు నుండి లింగాల కుడికాలువకు కృష్ణా జలాలను మంత్రులు విడుదల చేశారు.  ఇది ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గం. వై. ఎస్. కుటుంబాన్ని నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తున్న పురిటి గడ్డ కూడా ఇదే. అయితే.. టీడీపీ అధికారం లోకి వచ్చాక.. పులివెందుల కు సాగునీటిని తెప్పించేందుకు అప్పటి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వంటి వారు శపదాలు కూడా చేయాల్సి వచ్చింది. ఫలితంగానే.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పైడి పాలెం ఎత్తిపోతల పధకాన్ని కృష్ణా జలాలతో ప్రారంభించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ ఎత్తిపోతల పధకం ద్వారా పులివెందుల నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.  మంత్రులు దేవినేని ఉమ, ఆదినారాయణ రెడ్డి ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.. కృష్ణ జలాలను లింగాల కుడికాల్వకు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు జగన్ పై ఓ రకమైన దండయాత్రే చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ళు పులివెందుల ప్రాంతం వై ఎస్ కుటుంబాన్నీ ఆదరించినా కనీసం సాగునీటిని ఇవ్వలేకపోయారంటూ విమర్శించారు……ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా తన సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందుగా పులివెందులకే నీళ్ళిచ్చారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం మాత్రమే తెలుసనీ జగన్ లా రాష్ట్రాన్ని దోచుకోవడం తెలీదంటూ వివరించారు…..జగన్ ప్రత్యెక హోదా అంశాన్ని డ్రామాగా మలచుకున్నారని ధ్వజమెత్తారు. 2014 లో వైయస్ విజయమ్మను, ఆ తర్వాత వివేకానందరెడ్డిని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఒడిస్తామంటూ సవాల్ విసిరారు.చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పొలావరం వెళుతున్నరని.. జగన్ మాత్రం ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నారని ఎద్దేవాచేసారు.
ఏది ఏమైనా పులివెందుల ప్రాంతం అభివృద్ధికి  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని.. ప్రతిపక్ష నేత జగన్ చేసిందేమీ లేదంటూ టీడీపీ నేతలు సవాల్ విసిరి మరీ చెబుతున్నారు.
Tags:Krishna waters are released to the right wing of Lingas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *