Krishnamma is in the clutches of the clock

పంజాణి మండలంలో పరవళ్లు తొక్కుతున్న క్రిష్ణమ్మ

– క్రిష్ణాజలాలు ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు
– మంత్రి అమరనాథరెడ్డి, అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి

 

Date:17/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎవరు ఊహించని రీతిలో ప్రతిపక్షాల మాటలను వమ్ము చేస్తూ పుంగనూరు నుంచి హంద్రీనీవా నీరు పెద్దపంజాణి మండలం మాదనపల్లె వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు క్రిష్ణమ్మకు పూజలు చేశారు. పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి , ఆయన సోదరుడు పుంగనూరు కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి, పుంగనూరు ఇన్‌చార్జ్ అనీషారెడ్డి కలసి పంజాణి పొలిమేర్లలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణం తీర్చుకోలేమని కొనియాడారు. ముఖ్యమంత్రి మాట ఇచ్చిన మేరకు హంద్రీనీవా నీటిని విడుదల చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి, రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి, క్రిష్ణమ్మకు ఘనస్వాగతం పలికారు. రైతులు ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు.

 

తితిదే బోర్డు సభ్యులుగా ఇద్దరి నియమకo

Tags: Krishnamma is in the clutches of the clock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *