జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు

Krishnamma runs for the Jural Project

Krishnamma runs for the Jural Project

 Date:19/07/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
రెండు వారాలుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఆశలు మొదలయ్యాయి. కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. గతేడాదితో పోలిస్తే…నెల రోజుల ముందుగానే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.ఆల్మట్టిలోకి భారీగా వరద చేరుతోంది. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా 1701.94 అడుగులకు నీరు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్షా 53 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ లోకి లక్షా 53 వేల 258 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. అటు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నారాయణపూర్ డ్యాం నుంచి విడుదల చేసిన నీళ్లు ఇప్పుడిప్పుడే జూరాలకు చేరుకుంటున్నాయి. తుంగభద్రకు వరద పెరగటంతో 12 గేట్లు ఎత్తేశారు.మరోవైపు జూరాల పరిధిలోని నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ పంపులను ఆరంభించగా….శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తి ద్వారా కూడా నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  అటు ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆడ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 12 వందల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 698 అడుగులకు చేరింది.
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు https://www.telugumuchatlu.com/krishnamma-runs-for-the-jural-project/
Tags:Krishnamma runs for the Jural Project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *