నవంబర్‌ 15న జిల్లాకు కృష్ణమ్మ

Krishnamma to the district on November 15th

Krishnamma to the district on November 15th

– తొలుత పుంగనూరు ఉపకాలువకు ఏప్రిల్‌ 15 దాక విడుదల
– సంక్రాంతి తరువాత ప్రధాన కాలువ ద్వారా శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వేయర్లకు
– విజయవాడలో మంత్రుల సమీక్షలో అధికారుల నిర్ణయం

Date:21/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

నవంబర్‌ 15న అనంతపురం జిల్లా చెర్లోపల్లె రిజర్వేయర్‌ నుంచి జిల్లాలోని హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువకు కృష్ణజలాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం విజయవాడలో నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, పిఆర్‌ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన హంద్రీనీవా ప్రాజెక్టు ఉన్నతస్థాయి అధికారులు, కలెక్టర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణాజలాలను జిల్లాలోకి విడుదల చేయడంతో పాటు ప్రాజెక్టు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హాజరైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నియోజకవర్గంలోని పరిస్థితులను ఏకరువు పెట్టారు. సత్వరమే వీటిని విడుదల చేయాలని విన్నవించారు.

నవంబర్‌ 15 నుంచి….

చెర్లోపల్లె రిజర్వేయర్‌కు రెండు రోజులుగా జిడిపల్లె రిజర్వేయర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం:1.608 టీఎంసీల సామార్థ్యం కలిగిన చెర్లోపల్లె రిజర్వేయర్‌లో . 35 టిఎంసీల నీరే చేరింది. నీటి సామార్థ్యం పెరిగాక నవంబర్‌ 15 నుంచి నీరాగాటంగా నీటిని అందిస్తామని అనంతపురం జిల్లా అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 15 వరకు ఈ కాలువకు నీటిని తరలించి , చిత్తూరు జిల్లా అవసరాలు తీరుస్తామని స్పష్టం చేశారు. కాగా జిల్లాకు నీటిని తరలించే విషయంలో ఏ సమస్య ఉన్న కూడ ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టి, పరిష్కరిస్తామని మంత్రులు హామి ఇచ్చారు.

సంక్రాంతికి ప్రధాన కాలువకు…

వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి జిల్లాలోని ప్రధాన కాలువ ద్వారా కడప జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వేయర్‌, జిల్లాలోని అడవిపల్లె రిజర్వేయర్లకు నీటిని అందించేలా పనులు పూర్తి చేస్తామని అనంతపురం జిల్లా అధికారులు మంత్రుల సమక్షంలో పేర్కొన్నారు. ప్రధాన కాలువకు నీరు రావాలంటే అనంతపురం జిల్లా ఎన్‌పి.కుంట మండలంలోని 15ఎ ప్యాకేజిలో మిగిలిపోయిన స్వరంగం పనులు మూడు నెలలోపు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఈ పనులు పూర్తికాకపోవడం వల్లే జిల్లాలోని హంద్రీనీవాలోని ప్రధాన కాలువకు చుక్కనీరైన అందలేదు. ప్రధాన కాలువపై పెద్దమండం మండలంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయ్యాయని , కాలువ పని కొద్దిగా మిగిలి ఉందని మదనపల్లె ఎస్‌ఈ సుబ్బారావు వివరించారు. అలాగే భూముల పరిహారానికి సంబంధిన సమస్య ఉందని చెప్పడంతో సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్‌ భరత్‌గుప్తా అన్నారు.

టమోటను ఆశించే టుటా ఆబ్సల్యూటా నియంత్రణ కోసం సమగ్ర సస్యరక్షణ పై క్షేత్ర దినోత్సవం

Tags: Krishnamma to the district on November 15th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *