కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారుగా కృష్ణమూర్తి సుబ్రమణియన్

Krishnamurti Subramanian as Chief Economic Advisor of Central Finance

Krishnamurti Subramanian as Chief Economic Advisor of Central Finance

Date:07/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ముఖ్య ఆర్థిక సలహాదారుగా(సీఈఏ) ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ స్థానంలో కృష్ణమూర్తిని నియమించారు. చికాగోలో ఆయన పీహెచ్‌డీ పూర్తి చేశారు. సెబీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా గతంలో పని చేశారు. బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్‌బీఐ అకాడమీ బోర్డులో ఆయన ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ 20న సీఈఏ పదవికి అరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.పెద్ద నోట్ల రద్దు గురించి ఇటీవల మాజీ సీఈఏ సుబ్రమణియన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్రూరమైనది, దిగ్భ్రాంతికరమైనదని అన్నారు. ఈ చర్య అనేక రంగాలను ప్రభావితం చేసిందని, వృద్ధి ప్రస్థానాన్నే మార్చేసిందని విమర్శించారు. ఆఫ్‌ కౌన్సెల్‌: ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ ది మోదీ-జైట్లీ ఎకానమీ పేరుతో ఆయన రచించిన పుస్తకంలో ప్రత్యేకంగా నోట్ల రద్దు అంశానికి ఒక అధ్యాయాన్ని కేటాయించారు.
Tags:Krishnamurti Subramanian as Chief Economic Advisor of Central Finance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *