Natyam ad

తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

తిరుమల ముచ్చట్లు;


‘ఆదిపురుష్’ చిత్ర దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ వాళ్ళ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. తిరుమల శ్రీవారి  ఇవాళ ఉదయం ‘ఆదిపురుష్’ చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు ఓం రౌత్, సీతా దేవి పాత్రలో నటించిన కథానాయిక కృతి సనన్  ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. స్వామి వారి పాదాల చెంత మంగళవారం సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. నేడు ఉదయమే స్వామి వారి ఆశీస్సుల కోసం దర్శకుడు, హీరోయిన్ ఇతరులు వచ్చారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. దర్శనం పూర్తి చేసుకుని కారులో వెళ్లబోతున్న కృతి సనన్ వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో… ఆమె దగ్గరకు ఓం రౌత్ మళ్ళీ వచ్చారు. టాటా చెప్పారు. అక్కడి వరకు ఒకే.

 

 

 

అయితే… కృతిని హగ్ చేసుకున్న ఓం రౌత్, ఆమె చెంపపై ముద్దు (పెక్) పెట్టారు. ‘గాడ్ బ్లెస్ యూ’ (దేవుడు నిన్ను చల్లగా చూడాలి) అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. స్వామి వారి భక్తులకు ఆది కోపాన్ని తెప్పిస్తోంది. చిత్రసీమలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ టాటా బైబై చెప్పడం చాలా కామన్. సినిమా ఇండస్ట్రీ కల్చర్ అది. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో సర్వ సాధారణం. కానీ, తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట ఇలా ముద్దు పెట్టుకోవటాలు, ఆలింగనాలు లాంటివి సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తీసిన ఓం రౌత్ ఉద్దేశపూర్వకంగా  ఆ పని చేసి ఉండకపోవచ్చు. ఆయనకు భక్తి శ్రద్ధలు ఎక్కువే. అయితే, తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది.

 

Tags: Kriti Sanon and Om Raut’s behavior in Tirumala became controversial