శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది.సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి,
సూపరింటెండెంట్ భూపతి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Tags:Krittika Dipotsavam at Srikapileswara Temple

