దావోస్ లో కేటీఆర్ 13 కోట్ల ఖర్చు

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత నెలలో ఐదు రోజుల పాటు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దావోస్ చేరుకోవడానికి ముందు ఆయన ఐదు రోజుల పాటు బ్రిటన్ లోనూ పర్యటించారు. అంటే మొత్తం పదిరోజుల విదేశీ పర్యటనకు ఆయన, ఆయనతో పాటు వెళ్లిన పది మంది అధికారుల  అధికార బృందానికి కలిసి అయిన వ్యయం 13.22 కోట్ల రూపాయలు. కేటీఆర్ విదేశీ పర్యటన కోసం తొలుత ప్రభుత్వం బడ్జెట్ లో రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఆ మొత్తం సరిపోదని, మరో 7.80 కోట్లు అవసరమౌతాయని అధికారులు కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేటీఆర్ బృందం విదేశీ పర్యటన కోసం ప్రభుత్వం  9.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.ఆ నిధులను విడుదల చేసింది. కానీ అధికారులు అదనంగా మరో 3.42 కోట్ల రూపాయలు అవసరమౌతాయని చెప్పడంతో ప్రబుత్వం అందుకు అంగీకరించి వారు కోరిన మొత్తాన్ని మంగళవారం విడుదల చేసింది. అంటే బ్రిటన్ దావోస్ లలో కేసీఆర్ బృందం పది రోజుల పర్యటనకు అయిన మొత్తం 13.22 కోట్ల రూపాయలు. అదే దావోస్ పర్యటనకు సతీ సమేతంగా అధికార బృందంతో వెళ్లిన ఏపీ సీఎం ఖర్చు ఎంత అన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.దావోస్ పర్యటన అని బయలుదేరి జగన్ విదేశీ యానానికి ఉపయోగించిన లగ్జరీ చార్టర్ విమానానికే గంటలకు రూ 12 లక్షలు అద్దె చెల్లించారు. అంటే ఆయన మొత్తం విదేశీయానం వ్యయం ఎంత అయి ఉంటుదన్నది ఊహించుకోవచ్చు. కేటీఆర్ దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు.అయితే జగన్ పర్యటనతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నన్నది రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ఇంత వరకూ వెల్లడించలేదు. మొత్తం మీద ఇరు రాష్ట్రాలూ కూడా ఆర్థిక సంక్షోభంలో కూడా విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు వెచ్చించడం మాత్రం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాశంగా  మారింది.

 

Tags: KTR 13 crore cost in Davos

Post Midle
Post Midle
Natyam ad