కేటీఆర్ వర్సెస్ రేవంత్

Date:23/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు మామూలు ట‌ర్నింగ్ పాయింట్స్ లేవు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌చ్చి.. మొన్న పాలిటిక్స్ మొత్తాన్ని తిప్పేస్తే.. కాంగ్రెస్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి కూడా అదే ఎడ్జ్ లో ఉన్నారు. ఏదో ఒక‌టి చేసి.. కాంగ్రెస్ కికాస్త బూస్ట‌ప్ ఇచ్చి.. పార్టీని నిల‌బెట్టాలి అని చూస్తున్నారు. ఇక టీఆర్ఎస్ విష‌యానికొస్తే.. పార్టీలో కీల‌క‌మైన మార్పులు జ‌రుగుతున్నాయి. వారం రోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు అన్నీ టీఆర్ఎస్ చుట్టూనే తిరుగుతున్న‌య్. ఏ అప్డేట్ అయినా..అది టీఆర్ఎస్ పార్టీదే అయి ఉంటోంది. మిగ‌తా పార్టీలు గ‌ప్ చుప్ గా ఏం మాట్లాడాలో తెలీక‌.. మాట్లాడాల్సిన విష‌యం తెలిసినా ఏం మాట్లాడ‌లేక కామ్ గా ఉంటున్నాయి.కానీ.. టార్గెట్స్ మాత్రం ముందే ఫిక్స్ చేసుకున్నారు లీడ‌ర్లు. ఇప్ప‌టి దాకా..బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. క‌దిల్తే మెదిల్తే కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.. జైలుకి పంపుతాం అంటూ కామెంట్స్ చేసేవారు. ఒక్క‌సారి కేటీఆర్ సీఎం అయితే.. బండి రూట్ మార్చుకోవాల్సిందే. చేసేదేం లేదు. ఇక కాంగ్రెస్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి కూడాఅంతే. సీఎం టార్గెట్ గా ఎంత దూరం అయినా వెళ్లేవారు. కేటీఆర్ సీఎం అయితే.. ఇక టార్గెట్ కేటీఆర్ పైకి షిఫ్ట్ చేయాల్సిందే.అంత‌కు ముందు సీఎం కేసీఆర్ తో ఫైటింగ్ కోసం చేసుకున్న ప్లాన్స్ అన్నీ మార్చుకోవాలి. ఫైటింగ్ ఉంటే.. ఉత్తి కామెంట్స్

 

 

చేయ‌డ‌మే కాదు క‌దా. గ్రౌండ్ వ‌ర్క్ క‌చ్చితంగా ఉంటుంది. ఒక సీఎం ని టార్గెట్ చేయాలి అంటే.. ఎంతో నాలెడ్జ్ ఉండాలి.. స‌బ్జెక్ట్ ఉండాలి.. స్ట‌ఫ్ కూడా రెడీగా ఉండాలి. అందుకే.. రేవంత్ రెడ్డి కూడా ఫుల్ ఫోక‌స్ చేశార‌ట‌. గ‌తంలో కూడా రేవంత్ కి ..కేటీఆర్ కి మంచి ఫైటింగే నడిచింది క‌దా. డ్రోన్లు లేప‌డం లాంటి ఇష్యూస్ ఉన్న‌య్ క‌దా. వాటిని తిరిగి త‌వ్వుతారు అని తెలుస్తోంది. కేటీఆర్ ని టార్గెట్ చేయ‌డానికి.. రేవంత్ రెడ్డి ఏం ప్లాన్స్ వేస్తారు అనేది ఇంట్ర‌స్టింగ్ పాయింట్.ఇక‌పోతే.. కేటీఆర్ ని టార్గెట్ చేయ‌డం కూడా వెంట‌నే కాదు. ఎందుకంటే.. సీఎం కాగానే.. అది కాలేదు ఇది కాలేదు అంటే.. బావుండ‌దు క‌దా. కాస్త టైమిస్తే.. త‌న మార్క్ పాల‌న చూపిస్తా అంటారు. అప్పుడు కేటీఆర్ ని కొన్నాళ్ల పాటు.. టార్గెట్
చేయ‌డం వీలు కాదు. య‌ట్ లీస్ట్.. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌ మూడు నాలుగు నెల‌ల టైం అయినా ఇవ్వాలి. అప్ప‌టిలోగా ఎలా టార్గెట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ పాయింటే క‌దా.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: KTR vs. Rewanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *