Natyam ad

ప్రజలకు సేవలు అందించడంలో వలంటీర్ల కృషికి వందనం – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ కరోనా సమయంతో పాటు వారు అందిస్తున్న సేవలకు వందనం చేయక తప్పదని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. గురువారం సాయంత్రం మండల కార్యాలయంలో ఎంపీడీవో వెంగమునిరెడ్డి వలంటీర్లకు సేవవజ్ర అవార్డులు పొందిన జి.గోవిందు, బిందుసారిక లకు , సేవారత్న అవార్డులు పొందిన జగదీష్‌, జగదీశ్వరి, మమత, విజయకుమారి, గణేష్‌లకు అవార్డులు, ప్రశంసపత్రాలను , నగదు బహుమతులను అందజేసి సన్మానించారు. వలంటీర్లు చేస్తున్న సేవలు కుటుంబ సభ్యులు కూడ తమ వారికి అందించడం లేదనడంలో సందేహం లేదన్నారు. మండలంలో 274 మంది వలంటీర్లకు అవార్డులు, సన్మానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, సురేంద్రరెడ్డి, శంకరప్ప, నంజుండప్ప, మునస్వామి, విజయభాస్కర్‌రెడ్డి, బాబు, సుబ్రమణ్యం, రమణ, బాబ్‌జాన్‌తో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Kudos to volunteers for their efforts in providing services to the people – MPP Bhaskar Reddy

Post Midle