వైభవంగా చక్రతీర్ధ ముక్కోటి

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

Date: 09/12/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి సోమవారం ఉద‌యం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు హార‌తి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.  స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు.

 

 

 

 

 

 

 

పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్ర‌ముఖ తీర్థంగా చెప్పబడింది.

 

 

 

 

తిరుమలలో చక్రతీర్దముక్కోటి వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున ఉన్న శిలాతోరణం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు అర్చకులు. ఏటా మార్గశిర లోని శుద్ధద్వాదశినాడు చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆచారం.  తమిళ కార్తీకమాసంలో తిరుమల చక్రతీర్థం మహోత్సవం నిర్వహించడం ఆచారంగా వస్తుంది.  స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేసి… స్వామివారి కటాక్షాన్ని పొందారు. అప్పటి నుండి ఈ తీర్థం లోనే జపతపాలు చేసుకుంటూ ఉండిపోయారు పద్మనాభ మహర్షి. ఒకనాడు ఓ రాక్షసుడు మహర్షిని భక్షించడానికి ఈ స్థలానికి వచ్చాడు. తన భక్తుని కాపాడడం కోసం స్వామివారు తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి  శ్రీ సుదర్శన చక్రాన్ని ఈ తీర్థం లోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని ప్రార్థించాడు. లోక శ్రేయస్సు కోసం తన భక్తుడు పద్మనాభ మహర్షి కోరిన ఈ కోరికను స్వామివారు ఆమోదించి…. తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థం లోనే ఉండేలా ఆజ్ఞాపించారు. అప్పటి నుండి ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

 

 

 

 

 

 

ఇక వరాహ పూరానాన్ని పరిశీలిస్తే తిరుమల శేషగిరులలో ఉన్న 66 కోట్ల తీర్థాలలోనీ అత్యంత ముఖ్యమైన సప్త తీర్థాలలో చక్రతీర్థం ఒకటిగా పేర్కొంటుంది. ఇంత పవిత్రమైన చక్రతీర్థం లో తమిళ కార్తీకమాసంలో వచ్చే ద్వాదశి తిధి రోజున పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక చక్ర తీర్థ ముక్కోటి పురస్కరించుకొని స్వామివారికి ప్రాతఃకాల ఆరాధనలు పూర్తిచేసిన అర్చకులు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఆలయ ప్రదక్షిణ చేసుకుంటూ… చక్రతీర్థానికి చేరుకున్నారు. ఇక ఇక్కడ వెలసిన చక్రత్తాళ్వారు… నరసింహస్వామి… ఆంజనేయస్వామికి ప్రత్యేక  అభిషేకం, పుష్పాలంకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య‌ పేష్కార్ లోకనాథం ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

 

 

మహిళా రక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

 

Tags:Kudos to you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *