కుటుంబ ముద్ర పొగొట్టుకొనే ప్రయత్నం లో కుమార

Date:05/08/2019

బెంగళూర్ ముచ్చట్లు:

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అంత వైరాగ్యం ఎందుకొచ్చింది…? నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక సెంటిమెంట్ తో కొట్టాలని చూస్తున్నారా? ఇదే ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నానని, ఇకపై రాజకీయాల్లో కొనసాగాలే ఆసక్తి లేదని కుమారస్వామి కుండబద్దలు కొట్టడం వెనక వ్యూహముందా? అన్నది చర్చనీయాంశమైంది.ఇటీవల కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓటమి పాలయి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే.

 

 

 

ఇందుకు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలే కారణమని చెప్పకతప్పదు. పట్టుమని 14 నెలల పాటు ముఖ్యమంత్రిగా కూర్చోనివ్వని రాజకీయాలపై ఆయనకు విరక్తి పుట్టిందంటున్నారు. అలాగే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కుమారుడు నిఖిల్ గౌడ, తండ్రి దేవెగౌడల ఓటమి నుంచి కూడా ఆయన ఇంకా తేరుకోలేకపోయారంటున్నారు.కర్ణాకటలో కుమారస్వామి పార్టీ జనతాదళ్ ఎస్ కు కుటుంబ పార్టీగా ముద్ర పడింది.

 

 

 

 

కుమారస్వామి భార్య ఉప ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవణ్ణ ఎటూ మంత్రి వర్గంలో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కుమారుడు నిఖిల్ గౌడ, రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్, తండ్రి దేవెగౌడ పోటీ చేయడంతో కుటుంబ ముద్ర ఆ పార్టీపై మరింత పడింది. దీనికి తోడు జనతాదళ్ ఎస్ ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకుని రాజకీయాలు నడుపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.వీటిన్నింటికీ చెక్ పెట్టడానికే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.

 

 

 

 

త్వరలో కర్ణాటకలో 17 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇందులో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటే మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముంది. కుమారస్వామి తమ కుటుంబ సభ్యులు ఎవరూ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోరని కుమారస్వామి ప్రకటించడం వెనక అదే కారణమంటున్నారు.

 

 

 

 

 

కులముద్రను తొలగించుకోవడం, కుటుంబ పార్టీగా పేరును చెరిపేసుకుని ఉప ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కుమారస్వామి ఈ రాజకీయ వైరాగ్య ప్రకటన చేశారంటున్నారు.

జగన్ పై ఎదురుదాడికి వ్యూహాలు

Tags: Kumara in an attempt to get the family impression

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *