కుమారస్వామి…టెంపుల్ రన్ 

Kumaraswamy ... Temple Run

Kumaraswamy ... Temple Run

Date:14/08/2018
బెంగళూర్ ముచ్చట్లు:
82రోజుల్లో 40 ఆలయాలేంటి.. కర్ణాటక సీఎం టెంపుల్ రన్ ఏంటని కన్ఫ్యూజన్‌గా ఉందా. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుమారస్వామి సందర్శించిన ఆలయాల లిస్ట్ అది. మొన్నే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఖర్చుల వ్యవహారం హాట్‌టాపిక్ అయితే.. ఇప్పుడు టెంపుల్ రన్ ద్వారా సీఎం స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. పదవి చేపట్టినప్పటి నుంచి 40 ఆలయాలను దర్శించుకున్నట్లు ఈసారి తేలిందట. సీఎంవో ఆఫీస్ ఇచ్చిన సమాచారం మేరకు.
మే 23న కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి సోమవారం వరకు.. 82 రోజుల్లో 40 ఆలయాలకు కుమారస్వామి వెళ్లారట. వీటిలో 34 ఆలయాలను ఆదివారం రోజు సందర్శించారట. ఆలయాలు మాత్రమే కాదు.. ఆరు మఠాలను కూడా సందర్శించారట. వీటిలో మాండ్యలోని ఆదిచుంచనగిరి.. మైసూరులోని సుత్తూరు.. తుముకూరులోని సిద్దగంగ మఠాలకు వెళ్లారట. చాలా ఏళ్ల తర్వాత సీఎం పదవిని చేపట్టడంతో ఈ ఆలయాలను సందర్శించి తన మొక్కులు చెల్లించుకున్నారట. సోమవారం కూడా కుమారస్వామి హసన్ జిల్లాకు వెళ్లారు.
అక్కడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి.. ఓ ఫంక్షన్‌కు కూడా హాజరయ్యారట. ముఖ్యంగా ధర్మస్థల ఆలయంలో కుమారస్వామి కుటుంబంతో కలిసి మంజునాథ స్వామికి సర్వ సేవే పూజను నిర్వహించారు. రాష్ట్ర శ్రేయస్సు .. కర్ణాటకలో వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నందుకు సీఎం ఈ పూజ చేశారని ఆలయ పండితులు చెబుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం మొదటి నుంచి మతపరమైన ఆచారాలు, జ్యోతిష్యంపై నమ్మకముందంటున్నారు ఆ పార్టీ నేతలు.
అందుకే ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దేవెగౌడ అనారోగ్యపరమైన సమస్యలతో చాలా ఇబ్బందులుపడిన సందర్భాలున్నాయని.. తర్వాత ఆయన వెంటనే కోలుకున్నారని గుర్తు చేస్తున్నారు. దేవుడిపై ఆ కుటుంబానికి నమ్మకం ఎక్కువంటున్నారు. ఆలయాల సందర్శనలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డ్‌ను కూడా కుమారస్వామి బ్రేక్ చేశారట. అంతేకాదు 2008లో సీఎం అయిన యడ్యూరప్ప కూడా కుమారస్వామిలాగే ఆలయాలను సందర్శించి ఆ తర్వాతి స్థానంలో నిలిచారట. యడ్డీ ఒకడుగు ముందుకేసి కర్ణాటకలోని ఆలయాలు మాత్రమే కాకుండా.. కేరళలోని పుణ్యక్షేత్రాలు, వైష్ణో దేవి ఆలయాలకు కూడా వెళ్లారట. మొత్తం మీద కుమారస్వామి ఆలయాల సందర్శనతో మళ్లీ వార్తల్లో నిలిచారు.
Tags:Kumaraswamy … Temple Run

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *