సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్ ముచ్చట్లు:

 

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు.కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను ఈరోజు సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు.ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.తాను కుమారి ఆంటీతో ఉన్నాన‌ని, ఆమె గురించి ఎంతో విన్న‌ట్లుగా ఆ వీడియోలో సోనూసూద్ చెప్పుకొచ్చారు.ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు. కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతు న్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నా డు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని అడుగ‌గా.. రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ చెప్పింది.తాను వెజిటేరియ‌న్ అని ప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, నాన్ వెజ్ అయితే రూ.120 అని తెలిపింది.తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు.సోనూసూద్‌. అదే స‌మ‌ యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడు గ‌గా.. మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని చెప్పింది. ఈ రోజు నాకు లాట‌రీ త‌గి లింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ అన్నాడు.మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది.

 

 

Tags:Kumari aunty to Sonusood: Buffer offer..

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *