మ‌హారాష్ట్ర‌లో కుమ్ములాట‌లు…

Date:12/09/2020

ముంబై ముచ్చట్లు:

అధికారం నిలుపుకోవడమంటే అంత ఈజీ కాదు. పైగా సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పార్టీ ఏమాత్రం తగ్గదు. ప్రతి పార్టీ తమదే అధికారం, తమదే పెత్తనం అన్న ధీమాలో ఉంటుంది. మహారాష్ట్రలో ఇప్పుడు అదే జరుగుతుంది. అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిల మధ్య సఖ్యత లేదు. ప్రధానంగా పదవుల పంపకాలు, అధికారుల బదిలీలు వంటి విషయాలపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి.లాక్ డౌన్ నిర్ణయంపై కూడా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నిర్ణయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యతిరరేకించారు. తనకు తెలియకుండా ఏ నిర్ణయం జరగడానికి వీల్లేదని శరద్ పవార్ కండిషన్ పెట్టారు. ముఖ్యమైన నిర్ణయాల్లో తమ పాత్ర ఉండాలన్నది ఆయన ఖచ్చితమైన నిర్ణయం. పవార్ గీసిన గీతను ఉద్ధవ్ థాక్రే దాటలేని పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కండిషన్లు పెడుతుంది. ఈ రెండు పార్టీలు ఉద్ధవ్ థాక్రేను ఒకరకంగా శాసిస్తున్నాయనే చెప్పాలిఇక మూడు పార్టీల క్యాడర్ లో కూడా పోటీ తత్వం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఉన్న పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఏ పార్టీ ప్రాతినిధ్యం వహించే శాసనసభ లేదా పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్ కే పదవులు ఇవ్వాలన్న సూత్రప్రాయంగా మూడు పార్టీలూ అంగీకారానికి వచ్చాయి.

 

 

కానీ అనేక చోట్ల పార్టీ నేతలు దీనిని పట్టించుకోవడం లేదు. పెద్ద స్థాయిలో వత్తిళ్లు తెచ్చి పదవులు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనేక చోట్ల వికటిస్తున్నాయి.తన అనుచరుడికి పదవి దక్కలేదన్న కారణంగా ఏకంగా శివసేన పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. పర్టనీ లోక్ సభ సభ్యుడు సంజయ్ జాదవ్ తన నియోజకవర్గం పరిధిలోని జింటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకంలో తన మాట చెల్లుబాటు కాలేదని, ఎన్సీపీ నేతను నియమించారని ఆరోపిస్తూ రాజీనామా చేయడం సంచలనం కల్గించింది. అయితే ఈ రాజీనామాను ఆమోదిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే విభేదాల తీవ్రత అర్థమవుతుంది. అనేక చోట్ల ఇదే అసంతృప్తి శివసేన నేతల్లో కలుగుతుందంటున్నారు. ఇలా మొత్తం మీద అధికారంలో ఉన్న మూడు పార్టీల క్యాడర్, నేతల్లో విభేదాలు తలెత్తుతున్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.

సెప్టంబరు నెలలో కరోనా పీక్ స్టేజీ

Tags:Kummulatas in Maharashtra …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *