కుప్పం పార్టీ నేత రవి ఇంటిపై దాడి

ఖండించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్ ఆర్ రవి ఇంటిపై  దుండగుల దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. అర్థరాత్రి సమయంలో రవి ఇంటిపై మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేసిన వైసిపి నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి ఇంటిపై దాడి ఘటనపై చంద్రబాబు కుప్పం పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు. గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలో రవి 35 లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్సిడ్ డిపాజిట్ల విషయంలో కొద్ది కాలంగా వైసిపి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాడికి రెండు గంటల ముందు కూడా ఫోన్ చేసి రవిని బెదిరించినట్లు స్థానిక నాయకులు చంద్రబాబుకు వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Post Midle

Tags: Kuppam party leader Ravi’s house attacked

Post Midle
Natyam ad