Kurnool in the TDP

 కర్నూలు టీడీపీలో కుంపట్లు

Date:10/07/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేధాలు తారాస్థాయికి చేరాయా? నియోజకవర్గాలపై పట్టుకోసం నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోం ది.
కర్నూలు జిల్లా ఒక నాడు టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు ఉంటే టీడీపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలనే గెలుచుకుంది. దీంతో పార్టీ అధిష్ఠానం జిల్లాపై దృష్టి సారించింది. పార్టీ బలోపేతం కోసం ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను,  నేతలను పార్టీలో చేర్చుకు న్నారు. గతంలో పార్టీలో పనిచేసి దూరంగా ఉంటున్న నేతలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. దీంతో జిల్లాలో పార్టీ బలం పుంజుకుంది. అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ముఖ్యంగా అవతల పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలు రావడంతో పలు నియోజకవర్గాల్లో వర్గపోరు మొదలైంది. జిల్లా కేంద్రమైన కర్నూలు నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య అంతర్గతంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. గత ఎన్నికల్లో ఎస్వీ వైసీపీ నుంచి, టీజీ వెంకటేశ్ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఎస్వీ టీడీపీలో చేరారు. దీంతో అసలు సమస్య మొదలైంది. ఇటీవల కాలంలో జిల్లా టీడీపీలో జరుగుతున్న వరుస సంఘటనలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నా యి. ముఖ్యంగా కర్నూలు, ఆలూరు, కోడుమూరు నియోజ కవర్గాల్లో పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి.నియోజకవర్గంపై పట్టు సాధించుకునేందు కు టీడీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రత్యక్ష విమర్శలకు దిగుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతు న్నారు. పట్టించుకోవాల్సిన పెద్దలు కూడా చూసి చూడన ట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నేతల మధ్య విభేదాలు రోజురోజుకు ముదిరి పాకానపడుతున్నాయి.ముఖ్యంగా నియోజకవర్గంపై పట్టు కోసం ఎస్వీ, టీజీ మధ్య అంతర్గతంగా తీవ్ర పోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవాలని టీజీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల టీజీ భరత్ అమెరికా తరహాలో అభ్యర్థి ఎంపిక కోసం ఓటింగ్ జరపాలని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇది  అప్పట్లో కలకలం సృష్టించింది. ఇద్దరు నేతలు నియోవర్గంలో వాడవాడలా పర్యటిస్తున్నారు.పొత్తుల్లో భాగంగా కోడుమూరు టిక్కెట్ ను బీజేపీకి కేటాయించింది. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మణిగాంధీ విజయం సాధించారు. కాని ఎన్నికల తర్వాత వైసీపీ నేత డి విష్ణువర్థన్ రెడ్డి  టీడీపీలో చేరారు. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. కొంతకాలానికే ఎమ్మెల్యే మణిగాంధీ కూడా టీడీపీలో చేరారు. దీంతో సమస్య మొదలైంది. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై విష్ణు వర్గానికి రుచించడంలేదు.
 కర్నూలు టీడీపీలో కుంపట్లు https://www.telugumuchatlu.com/kurnool-in-the-tdp/
Tags:Kurnool in the TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *