విత్తన శుద్ధి కేంద్రలపై కొరవడిన తనిఖీలు.

-రైతులు కూడా ధర్నాలు చేయక తప్పడం లేదంటున్న విశ్లేషకులు
నంద్యాల ముచ్చట్లు:
 
 
నవనందిగడ్డ నంద్యాల  అటువంటి నంద్యాలను కొంతమంది నకిలీల కేటుగాళ్ల వల్ల చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిపుణులు. నంద్యాల అంటే విత్తనాలు నూతన వంగడాలు ఊపిరి
పోసుకున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన నంద్యాల బ్రాండ్ కు నకిలీ మకిలీ అంటుతోందని పలువురు అంటున్నారు. కొందరు ధనార్జనే ద్వేయంగా నకిలీ విత్తనాలను ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా
చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు . నంద్యాల యందు 12 విత్తన శుద్ధి కేంద్రలు ఉన్నట్లు తెలుస్తోంది. సీడ్స్ విత్తనాలు శుద్ధి చేసే సమయంలో సీడ్స్ ఇన్ స్పెక్టర్ తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలు
వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు. గద్వాల తమిళనాడు లో విత్తన శుద్ధి కేంద్రలు మూత పడటంతో నంద్యాల వైపు వ్యాపారులు
ద్రుష్టి సారించారు. దీంతో నంద్యాల లో విత్తన శుద్ధి కేంద్రాల్లో అదనపు యంత్రాలను ఏర్పాటు చేసి రేయింబవళ్లు విత్తనాలు వేరు చేసే ప్రక్రియ చేపడుతున్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిసీడ్స్ కంపెనీల మీద దండయాత్రలు రోడ్డు మీద ధర్నాలు చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పలువురు రైతులు
వాపోతున్నారు. అదే ఆదికారులు నకిలీ విత్తనాలను అరికట్టితే మేము రొడ్డు ఎక్కి నిరసనలు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని పలువురు రైతులు అంటున్నారు . అంతేకాకుండా భారత దేశంలోనే
నంద్యాల కు మంచి పేరు వచ్చింది కానీ నకిలీ కేటుగాళ్ల వల్ల అవినీతి అధికారుల వల్ల చెడ్డపేరు వస్తోందని నిపుణులు రైతులు అంటున్నారు.
 
Tags:Lack of inspections on seed treatment plants

Leave A Reply

Your email address will not be published.