ప్రాజెక్టులకు భద్రత కరువు

గుంటూరు ముచ్చట్లు:


రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి కీలకమైన ప్రాజెక్టులు నిర్వహణ లోపంతో దెబ్బతింటున్నాయి. వీటికి సంబంధించిన నిధులివ్వడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రాజెక్టుల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో గేట్లకు, హైడ్రాలిక్‌లకు, రోప్‌లకు గ్రీజ్‌ పూసే పరిస్థితి లేకుండాపోయింది. గతేడాది పులిచింతల మొదలు అన్నమయ్య, గుండ్లకమ్మ, పోతిరెడ్డిపాడు ఇలా ఏదో ఒక ప్రాజెక్టు నిర్వహణ లోపంతో దెబ్బతింటున్నాయి. 2020 సెప్టెంబరులో పులిచింతల 16వ గేట్‌ హైడ్రాలిక్‌ దెబ్బతిని గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టును ఖాళీ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనతో ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కేటాయించడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుందని ఆశించిన రైతాంగానికి 2021లో అన్నమయ్య ప్రాజెక్టు ధ్వంసం, ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టు దెబ్బతిన్న గేట్ల వ్యవహారంతోపాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 10వ గేటు తెగిపోయింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న నాలుగు గేట్ల పక్కనే 2005లో 44 వేల క్యూసెక్కులు వెళ్లేలా 10 గేట్లతో హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నిర్వహణ కోసం గత నాలుగేళ్లుగా ఒక్కరూపాయీ ఇవ్వలేదు. ఇటీవల 10వ గేటు కిందికి జారిపోయింది. నీరంతా కిందకు పోయింది. మరమ్మతుపై ఇంతవరకు ప్రభుత్వం దృష్టి సారించలేదు. గుండ్లకమ్మ రిజర్వాయరుది అదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో 3.87 టిఎంసిల సామర్థ్యంతో గుండ్లకమ్మ నదిపై చేపట్టిన కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు

 

 

 

గేట్ల నిర్వహణ కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం అందుకు తగ్గ నిధులను మంజూరు చేయలేదు. ఇటీవల మూడో గేట్‌ ధ్వంసమైంది. ప్రాజెక్టులోని నీరంతా సముద్రం పాలై ఖరీఫ్‌ సాగుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ లోపంతోనే పూర్తిగా కొట్టుకుపోయింది. ఎగువన కురిసే వర్షాలకు ఎంతనీరు ప్రాజెక్టులోకి వస్తుంది, దిగువకు ఎంత నీరు వదలాలి అనే నిర్వహణ యంత్రాంగం లేకపోవడంతో ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టరును మార్చే క్రమంలో ఈ ప్రభుత్వం దాదాపు ఆరు నెలలు పనులు నిలిపివేయడంతో ఆ ప్రభావం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై పడి 2020లో వచ్చిన వరదలకు ఏకంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఇప్పటికీ డయాఫ్రం వాల్‌ ఏమేర దెబ్బతింది, ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై జలవనరులశాఖ వద్ద స్పష్టతలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన 2009 వరదలతో దెబ్బతిన్న ప్లంజ్‌పూల్‌ మరమ్మతుల పనులు చేయాలని కేంద్ర నిపుణుల కమిటీ నివేదికలు ఇచ్చినా రెండు ప్రభుత్వాలూ స్పందించని పరిస్థితి నెలకొంది.

 

Tags: Lack of security for projects

Leave A Reply

Your email address will not be published.