లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ, మే 26న థియేట్రికల్ విడుదల
హైదరాబాద్ ముచ్చట్లు:
‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడం తో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మేమ్ ఫేమస్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడీ చిత్రం విడుదల ప్రీ పోన్ అయ్యింది. ముందు చెప్పిన డేట్ కంటే ముందే విడుదలౌతుంది. మే 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తునట్లు తాజాగా అనౌన్స్ చేశారు.
ఫేమస్ విజయ్ దేవరకొండ మేమ్ ఫేమస్ కొత్త విడుదల తేదీని ఫన్ వే లో అనౌన్స్ చేసి యంగ్ టీమ్ ని ప్రోత్సహించాడు. మే 26 నుండి థియేటర్లలో మేమ్ ఫేమస్‌ని చూడామని తన స్టైల్‌లో కోరారు. టీమ్ విడుదల చేసిన ఫన్ వీడియోలో,.. ‘ట్రాక్టర్ లా పోస్తాం డీజిల్.. విజయ్ అన్న ఒచ్చిండు కొట్టుర్రా విజిల్’ అంటూ టీమ్ చెప్పగా, దీనికి ‘వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్… మే 26న మేమ్ ఫేమస్ కి అందరూ కమ్ కమ్ కమ్ ‘ అంటూ విజయ్ బదులు చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర పాటలను, యూత్‌ఫుల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది.ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.తారాగణం: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్.
Tags:Lahari Films, Chai Biscuit Films ‘Mem Famous’ Vijay Devarakonda Announces New Release Date, May 26 Theatrical Release