Lakh chargesheets should be filed against BJP

బీజేపీపై లక్ష చార్జీషీట్లు వేయాలి

Date:24/11/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

 

గ్రేటర్‌ ప్రచారంలో టీఆర్ఎస్‌ సర్కార్‌పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై దిమ్మతిరిగేలా వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రులు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తమపై ఛార్జ్‌షీట్‌ ఎందుకు వేస్తుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. బీజేపీపై ఛార్జ్ షీట్‌లు వేసేందుకు లక్ష కారణాలు ఉన్నాయన్నారు. వృద్ధుల్ని ఆదుకున్నందుకు మా పై ఛార్జిషీట్లు వేస్తున్నారా ? తెలంగాణను అభివృద్ధి చేస్తున్నందుకా మాపై ఛార్జ్ షీట్లు వేస్తున్నారా? పవర్ హాలిడేలు ఎత్తేసినందుకా ఛార్జీ షీట్లా? గల్లి గల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టినందుకా ? ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నందుకా ?అంటూ కేటీఆర్ నిలదీశారు.కేంద్రమంత్రులు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కు మేం ఏం చేశావో చెప్ప గలమన్నారు. బీజేపీ ఏం చేసిందో చెప్పండని డిమాండ్ చేశారు. ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు.? బీఎస్ఎన్ఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారని మండిపడ్డారు. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? బీజేపీ పాలసీ అన్నింటిని అమ్మేసి పాలసీ అంటూ దుయ్యబట్టారు కేటీఆర్. అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారన్నారు. చార్మినార్ గోల్కొండను కూడా అమ్మేస్తారని విమర్శించారు. ప్రధాని బుర్రకు కూడా తట్టని రైతు బంధును తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్ పెట్టినందుకు దేవుడు కూడా మోదీ మీద ఛార్జ్ షీట్ వేయాలని మండిపడ్డారు కేటీఆర్.

 

 

ముందు వెనుక ఆలోచించకుండా లాక్ డౌన్లు విధించినందుకు వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచారన్నారు. నెత్తిన మూట, సంకల బిడ్డను ఎత్తుకొని… కీలోమీటర్ల కొద్ది నడిచి వందలమంది ప్రాణాలు కోల్పోయరన్నారు. దానికి చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు సైతం మోదీపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు కేటీఆర్. లక్షలమంది ఉపాధి కోల్పోయిన యువత సైతం మోదీపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు కేటీఆర్.కేంద్రం మంత్రులు సైతం  అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్‌ఎస్‌ ప్రభత్వుంపై షార్జ్‌షీట్‌ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే  టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను నిలదీశారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అని విమర్శించారు. రైల్వే రంగాన్ని ఎందకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కూడా అమ్మేస్తారని విమర్శించారు. ప్రజలు అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

 గ్రేటర్ లో హోరెత్తుతున్న ప్రచారం

Tags:Lakh chargesheets should be filed against BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *