Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు లక్ష కుంకుమార్చన

చౌడేపల్లి ముచ్చట్లు :

ఆంధ్ర రాష్ట్రము, చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు 08-02-2023 వ తేది 10-02-2023 వ తేది వరకు అత్యంత వైభవముగా జరుగుచున్న లక్ష కుంకుమార్చన కార్యక్రమములో మొదటి రోజు 08-02-2023 వ తేదీన 125 మంది దంపతులు పాల్గొన్నారు. వీరికి చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ  ఆధ్వర్యంలో సదరు దంపతులచే దేవస్థాన వేదపండితులు శ్రీ అమ్మవారికి లక్ష నామ మంత్రములతో దంపతులచే హోమము మరియు పూజాది కార్యక్రమములు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమములో పాల్గొన్న దంపతులు అభీష్టసిద్ధి కొరకు పూజలు చేసి శ్రీ అమ్మవారి కృపకు పాత్రులయినారు మరియు 90 సంవత్సరముల వయస్సు గల పుంగనూరు వాసి ప్రస్తుతము ముంభై నందు స్థిరపడిన   M. గోపీనాధ్  ప్రస్తుతము దేవస్థానము నందు జరిగిన అభివృద్దిని చూసి శ్రీ అన్న ప్రసాద వితరణకు తన వంతుగా రూ. 8,000/- విరాళముగా ఇవ్వడము జరిగినది. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, మెంబర్లు   పూర్ణిమ రాయల్ మోహన్,   శ్రావణి భాను ప్రకాష్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు.

Post Midle

Tags:Lakh kumkumarchana at Sri Boyakonda Gangamma Devasthanam

Post Midle