మహిళా సంఘాలకు లక్ష గ్రాంటు

Date:08/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ముదనష్టపు కేసీఆర్ పాలనలో మహిళలు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో ఒక్క మహిళకు తన మహిళకు మంత్రిగా పనిచేసే సమర్థత లేదన్న కేసీఆర్ కు. రాష్ట్రంలో మహిళల ఓట్లు అడిగే హక్కు లేదని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు అయన కుత్బుల్లాపూర్ లో జరిగిన మహిళా సాధికారత సభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా సాధికారత తీసుకొచ్చాం.
దరిద్రపు కేసీఆర్ పాలనలో ఒక్క మహిళా సంఘానికి భవనాలు నిర్మించిన పాపాన పోలేదని అన్నారు. మహిళా సంఘాల డబ్బులు కూడా కేసీఆర్ దోచుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మహిళా సంఘాలకు  లక్ష రూపాయల గ్రాంట్ విడుదల చేస్తాం. ఈ గ్రాంట్ తిరిగి కట్టవలిన పనిలేదు. ప్రతి మహిళా సంఘానికి పదిలక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామని అన్నారు. డిసెంబర్ 12 న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపడుతోంది. మహిళా సంఘం సభ్యులు ఎవరైనా ప్రమాద వశాత్తు  చనిపోతే ఐదు లక్షల భీమా కల్పిస్తాం. అభయహస్తం స్కీం ను పునరుద్దిస్తామని భరోసా ఇచ్చారు.
గ్రామాల్లో పనిచేస్తున్న మహిళా  వర్కర్స్ కు పది వేల జీతం, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి ఆరు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని అన్నారు. రేషన్ షాపుల ద్వారా  తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం ఏడు కిలోలు అందజేస్తాం. సన్నబియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకుల రేషన్ ద్వారా అందజేస్తామని అన్నారు. దళిత,గిరిజనులకు రేషన్ ఉచితంగా అందిస్తాం. దళిత,గురిజనులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. వృద్ధుల పెన్షన్ల ను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచుతాం,
వికాలాగులకు 1500 నుంచి 3000 పెంచుతాం. అర్హులైన భార్యా భర్తలు ఇద్దరికి పెన్షన్స్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తల్లి తండ్రులకు కూడా పెన్షన్స్ ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కరెంట్ బిల్లులు కట్టుకోలేని వారికి ప్రభుత్వం బిల్లులు కడుతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు నేరుగా అందిస్తాం.
లబ్ధిదారులు వారి స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కట్టుకున్న వారికి అదనంగా రెండుంలక్షలు అందజేస్తాం. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే గెలుపని అన్నారు. రాష్ట్రాన్ని లోటీ చేసిన టిఆర్ఎస్ ను తరిమికొట్టాలి. అధికారంలోకి రాగానే  శెట్టి బలిజ కులాన్ని బీసీల్లో కలుపుతామని అన్నారు.
Tags: Lakhs grants for women’s unions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *