సేవల పేరుతో లక్షల రూపాయలు దోపిడీ

The amount of Rs

The amount of Rs

Date:14/01/2019
ఖమ్మం ముచ్చట్లు:
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవల పేరిట చేసిన ఘరానా మోసాన్ని హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులు చేధించారు. శ్రీవారి ఆలయంలో వివిధ సేవల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. నెల్లూరుకు చెందిన రాజ్‌కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. కొంతకాలం క్రితం అమీర్‌పేటకు చెందిన సుకుమార్‌రెడ్డితో అతడికి పరిచయం ఏర్పడింది. తనకు టీటీడీలో మంచి పరిచయాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో శ్రీవారి ఆలయంలో సేవలు నిర్వహించుకునేలా చేస్తానని అతడిని రాజ్‌కుమార్ నమ్మించాడు. అభిషేక పూజకు రూ.2500, శేషవస్త్రాల బహుకరణకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో సుకుమార్‌ ముందుగా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత సుకుమార్‌ తనకు నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవచ్చని స్నేహితులు, బంధువులకు చెప్పడంతో మరో 15 మంది రాజ్‌కుమార్‌రెడ్డికి డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా రాజ్‌కుమార్ దర్శనం చేయించకపోగా తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుమారు రూ.20లక్షల వరకు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్ గతంలో విజయవాడలోనూ ఇదే తరహా మోసానికి పాల్పడి జైలుకెళ్లాడని, బయటకు వచ్చాక హైదరాబాద్ మకాం మార్చి మళ్లీ మోసాల బాట పట్టాడని పోలీసులు తెలిపారు.
Tags:The amount of Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *