Natyam ad

అత్యంత వైభవముగా లక్ష కుంకుమార్చన

చౌడేపల్లి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లిలో వేంచేసియున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఆలయ చైర్మన్ నాగరాజ రెడ్ది  ఆద్వర్యములో  01న ఆఖరి రోజు అత్యంత వైభవముగా లక్ష కుంకుమార్చన కార్యక్రమము నిర్వహించడము జరిగినది. సదరు లక్ష కుంకుమార్చన కార్యక్రమములో ఉభయదారులుగా 167 మంది దంపతులు పాల్గొని వారి అభీష్టసిద్ది కొరకు పూజ చేసి శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు అయినారు. పుంగనూరు M.P.P.   భాస్కర్ రెడ్డి  దంపతులు పూజల యందు పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేసిన ఉభయదారులకు మరియు భక్తాదులకు ఉచిత అన్నదానము చేయడము జరిగినది. వీరికి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు P. రజని, K. రామదాస్, G. భారతి, A. రాజేశ్, M. బుడ్డమ్మ, S. పవన్ కుమార్, N. భాస్కర్ రెడ్డి, C. లక్ష్మిదేవమ్మ, K. హైమావతి, D. రెడ్డెప్ప, దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Laksh Kumkumarchana is the most glorious

Post Midle