23 నుంచి బోయకొండలో లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఫిబ్రవరి23 తేది నుంచి మూడురోజులపాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి తెలిపారు. బుధవారం ఆలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ దంపతులిద్దరూ హాజరై అమ్మవారి సన్నిధిలో రూ:1016 చెల్లించి పూజా కార్యక్రమాలలో పాల్గొ నవచ్చునన్నారు.ఆధిపరాశక్తిగా పేరొందిన బోయకొండ అమ్మవారికి ప్రతియేటా మాఘమాసంలో లక్షనామ మంత్రముతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోందన్నారు. పూజల్లో పాల్గోనే లకు నిత్యసౌభాగ్యములు, అషై్ట శ్వర్యములు కలుగునని భక్తులలో నమ్మకం.లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో ఉభయదారులుగా వ్యవహరించాల్సిన భక్తులు రూ:1016 చెల్లించి తప్ప్రనిసరిగా రశీదు పొందాలన్నారు. మిగిలిన వివరాలకు 7901642845,7901642846 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Laksha Kunkumarchana in Boyakonda from 23rd