ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి లో లక్ష పుష్పార్చన

Date:23/02/2021

యాదాద్రి భువనగిరి  ముచ్చట్లు:

లక్ష్మీనృసింహస్వామి స్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర నామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిద రకాల పూలతో లక్ష పుష్పర్చన జరిపారు. సుమారు రెండు గంటల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువు దీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక బృందం, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Laksha Pushparchana in Yadadri to celebrate Ekadashi Parvati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *