తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన
తిరుచానూరు ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మూత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో లక్షకుంకుమార్చన వైభవంగా నిర్వహించారు.. అమ్మవారి ఆలయంలో దాదాపు 13 సంవత్సరాల క్రితం లక్ష కుంకుమార్చన సేవను ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మవారి సహస్రనామాన్ని 10 సార్లు 20 మందికిపైగా అర్చక స్వాములతో ప్రార్థన చేస్తారు. అమ్మవారు మంచి శక్తితో ఉండి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో భక్తులందరికీ పరిపూర్ణమైన కృపాకటాక్షాలు అందించాలని కోరుతారు. లక్ష కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు శక్తి, ముక్తి, భక్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు.

Tags: Lakshkumkumarchan as a science in Sri Padmavati Ammavari Temple, Tiruchanur
