దురాక్రమణాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లక్ష్మయ్య

తిరుపతి  ముచ్చట్లు:

 

మంగళం బి టి ఆర్ కాలనీలో దురాక్రమణాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లక్ష్మయ్య.బీ టి అర్ కాలనీలో నాగేంద్రమ్మ 2010వ సంవత్సరంలో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు.ఆ ఖాళీ స్థలం ఇంటి వెడల్పు 20 అడుగులు, పొడవు 36 అడుగులు గా నమోదు కావడం జరిగింది.గతంలో బి టి ఆర్ కాలనీ సిపిఎం పార్టీ నాయకులు పేద ప్రజలకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.10 సంవత్సరాలుగా కాపురం ఉంటున్న నాగేంద్రమ్మ కుటుంబం.నూతనంగా ఇంటి కాళీ స్థలాన్ని సంవత్సరం క్రిందట కొన్న కానిస్టేబుల్ లక్ష్మయ్య వారిని బెదిరిస్తూ. అక్రమణలకు పాల్పడి అర్థగజం ఇంటి స్థలాన్ని ఆక్రమించుకొని గోడ కట్టారు. నాగేంద్రమ్మ ఏదైనా మాట్లాడితే అక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది అతనికి సపోర్ట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.నాగేంద్రమ్మ కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేస్తున్న కారణమని ఆలోచించగా నాగేంద్రమ్మ వాళ్లు ఎస్సీ హిందూ మాదిగ కులానికి చెందినవారు.

 

 

తక్కువ జాతి వారు మా మధ్య ఎలా ఉంటారని కొంతమంది కూడా గతంలో స్థానికంగా ఉన్న మహిళలతో గొడవ చేయడం జరిగింది.కావున నాగేంద్రమ్మకు న్యాయం చేయాలని మీడియా వారిని ఆశ్రయించడం జరిగిoది.ఈ సమస్యను అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని నాగేంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.తిరుపతి జిల్లా పరిపాలన అధికారి జోక్యం చేసుకొని బి.టి.ఆర్ కాలనిలో దురాక్రమణకు గురైన కుటుంబాలకు న్యాయం చేయాలని అన్నారు.

 

Tags: Lakshmaiah is a traffic constable who is committing acts of aggression

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *