లక్ష్మణుడు లేని రామాలయం

Date:16/04/2019

 నిజామాబాద్ ముచ్చట్లు :
సాధారణంగా రామాలయంలో రామునితో పాటు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉంటాడు. కాని నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్ వాయి గ్రామంలోని రామాలయంలో లక్ష్మణుడు లేకుండానే రామాలయం ఉంది. భారత దేశంలో మొత్తంలో ఇలాంటి ఆలయం ఎక్కడ లేకపోవడంతో ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఆలయానికి దాదాపు 250ఏళ్ల చారీత్రక ప్రాధాన్యత కల్గి ఉండడం, ఇందూర్‌ రుద్రమదేవీగా పిలవబడే సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి ఆలయాన్ని పునర్మించి పూజలు చేసింది. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలున్న ఇందల్వాయి రామాలయంపై శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక కథనం…బురదలో పూసిన కమలం వలె ప్రకాశిస్తుందని, దక్షిణ భారత దేశంలో తిరుమల తర్వాత అంతటి రాచమర్యాదలతో తులతూగుతున్న దేవాలయమని కాశీయాత్ర చరిత్ర పుస్తకంలో ప్రముఖ రచయిత ఏనుగుల వీరస్వామి ఇందల్వాయి రామాలయం గురించి పలు ఆసక్తి కర అంశాలను వివరించారు. ఈ ఆలయంలోని విగ్రహం నిజామాబాద్‌ రఘునాథ ఆలయం నుంచి తీసుకువచ్చారని ప్రతీతి. శివాజీ గురువు సమర్థ రామదాసు ప్రతిష్టించారు. ఇక్కడ విగ్రహం ఆరడుగుల ఎత్తుతో చూడ రమణీయంగా చెక్కబడింది. విగ్రహం చుట్టూ దశావతారాలు, లోపల మూడు సాలీగ్రామాలు ఉన్నాయి.
హనుమంతుడు చెక్కబడి లక్ష్మణుడు మాత్రం లేకపోవడం విశేషం. ప్రతి రామాలయంలో కర్కాకట లగ్నంలో స్వామివారి కల్యాణం చేస్తారు. ఇక్కడ మాత్రం రాముని జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని పోన్నచెట్టు వాహన సేవ ఇక్కడ మరో ప్రత్యేకత.ఈ ఆలయ పరిసరాల్లో పూర్వం కత్తుల కార్మాగారం ఉండేదని ప్రతీతి. ఈ ప్రాంతంలో నాణ్యమైన ఇనుప ఖనిజం లభించేదని, అది స్విట్జర్లాండ్‌లో లభించే ఖనిజంతో పోలి ఉండేదని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ తయారు చేసిన కత్తులు వివిధ సంస్థానాలకు ఎగుమతి చేసేవారట. దీనికి సంబంధించిన అనవాలు మాత్రం ఇప్పడు కన్పించడం లేదు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఇంత రమణీయంగా చెక్కిన విగ్రహం ధ్వంసం కాకూదని నిజామాబాద్‌ రఘునాథ ఆలయం నుంచి ఇక్కడికి తరలించినట్లు పూర్వీకులు చెబుతారు. అనంతరం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీ బాయి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. అయితే ఆలయానికి గ్రామస్తులు పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో ఉన్నారు….  శ్రీ రామ నవమి సందర్భంగా ఇక్కడ వారం రోజుల పాటు ప్రత్యేక ఉత్సావాలు నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సీతరాముల వారికి పోన్నచెట్టు వాహన సేవ  నిర్వహిస్తారు…..
Tags:Lakshmana Ramallah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *