Natyam ad

లక్ష్మీ కాసులమాల అలంకరణలో అమ్మవారు

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గజవాహనానికి అలంకరించే లక్ష్మీ కాసుల మాలను టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి  అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్లారు.  తిరుమలలో గురువారం ఉదయం లక్ష్మీకాసులమాలను తిరుమాడా వీధుల్లో ఊరేగించి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి అమ్మవారు గజవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుచంది.  అమ్మవారికి ఎంత ఇష్టమైన గజవాహనానికి లక్ష్మీ కాసుల మాల తిరుమల శ్రీవారి నుంచి వెళ్లడం ఆచారం. టీటీడీ ఈవో మాట్లాడుతూ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంతంత వైభవంగా జరుగుతున్నాయని స్వామి వారి లక్ష్మీకాసులమాలను అమ్మవారి గజ వాహనంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని ఈవో తెలిపారు. లక్ష్మీకాసుల హారాన్ని ఆలయంలో స్వామివారి గర్భాలయం వద్ద ఉంచి హారతి ఇచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి పంపిస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు.

 

Tags: Lakshmi is an Amma in Kasulamala decoration

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.