వెండి గరుడ వాహనంపై లక్ష్మీనరసింహుడు
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. .గుట్టపైన గల బాలాలయం లో వెండి గరుడ వాహనంపై.. భక్తులకు లక్ష్మీనరసింహ స్వామి వారు దర్శనమిచ్చారు. వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి కి చేరుకొని స్వామివారి ని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. భక్తులు మాస్క్ లు ధరించి, బౌతిక దూరం పాటిస్తూ.. క్యూలైన్ల ద్వారా శ్రీ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయంలో అధికారులు కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఆలయ ప్రాంగాణాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు.
సూర్యుడు ఉత్త రాయణానికి మరే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున సాక్షాత్తు మహావిష్ణువు గారుడవహనంపై ముకోటి దేవతలతో భూలోకానికి వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి.అందుకే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని పాపవిముక్తులు అవుతారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Lakshminarasimha on a silver Garuda vehicle