అప్పన్న ను దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ

విశాఖపట్నం    ముచ్చట్లు:
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామివారిని   మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులు ఆయనకు స్వాగతం పలికి… వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందించారు. కరోనాలాంటి విపత్కర  పరిస్థితులనుంచి కాపాడాలని, ప్రజలందరికీ స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థనలు చేశారు.  కన్నాకు ట్రస్టు బోర్డు సభ్యులు దినేష్ రాజు, సూరిబాబు  శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి జ్ఞాపికను అందించారు. కన్నా టికెట్లు తీసుకోవడంతోపాటు స్వామివారి నిత్యకళ్యాణం టికెట్ కూడా కొనుక్కున్నారు.  ప్రతిఒక్కరికీ టికెట్టు పెట్టడం చాలా సంతోషకరమని, మంచి నిర్ణయమంటూ ఈఓ, ట్రస్టుబోర్డు సభ్యులను ప్రశంసించారు. దేవుని ఎదుట అందరూ సమానమేనని చెప్పారు కన్నా.  తన దర్శనం సంతృప్తికరంగా జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Lakshminarayana than visiting her father

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *