వైస్ ఎంపీపీగా లలిత కుమారి
విశాఖపట్నం ముచ్చట్లు:
డుంబ్రిగుడ మండల రెండవ వైస్ ఎంపీపీ గా పంచాయతీ లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ బాబు ఆధ్వర్యాన మంగళవారం ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఈమెకు వైసిపి, టిడిపి ,బిజెపి ఎంపిటిసి సభ్యులందరూ చేతులెత్తి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీధర్ బాబు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఆమెకు స్థానిక ఎంపిడిఓ భాగ్య రావు రిటర్నింగ్ ఎన్నికల అధికారి శ్రీధర్ బాబుతో పాటు ఎంపీపీ బి ఈశ్వరి ,వైస్ ఎంపీపీ ఎస్ ఆనంద్ తో పాటు ఎంపీటీసీ సభ్యులంతా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Lalit Kumari as Vice MP