లలిత త్రిపురా సుందరీగా దుర్గమ్మ

Date:13/10/2018
విజయవాడ ముచ్చట్లు:
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజైన శ నివారం కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి..
ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని నమ్మకం. దేవీ భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. ఈ మాసంలో జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. నవ రాత్రుల నాలుగో రోజున లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు.
త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగో రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. జ్యోతిషశాస్త్ర రీత్యా చంద్రుడంటే తల్లి. తల్లి అంటే జన్మనిచ్చింది, జగన్మాత. కాబట్టి జగన్మాత ఆరాధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
జగన్మాతనే లలితా దేవిగా ఆశ్వయుజ మాసంలో పూజలందుకుంటోంది. ప్రతిప్రాణిలో ఉండే శక్తే చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి. దీనినే నారాయణీ స్తుతి ‘త్వయైకయా పూరిత మంబయైతత్’ అంటూ ధృవపరుస్తుంది. వేయిసార్లు జపించే శివవిష్ణు నామాలకంటే ఒక్కసారి అమ్మను మనసార ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మను పూజించినవారికి పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించినా తల్లి దయను పొందే అవకాశం ఉంది. సహస్రనామాన్ని పఠించినవారికి దీర్ఘాయుష్షు, వంశాభివృద్ధి. అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తికూడా జరుగుతుందని హయగ్రీవుడు పేర్కొన్నాడు.
నిరాకారం, నిశ్చలమైనది- శివతత్త్వం. శివుణ్ణి ఆశ్రయించి ఉండేది- పరాశక్తి. శక్తిని అనుసరించి ఉంటాడు- పరమశివుడు. ఇదే శివశక్తి సామరస్యం. లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి.. లోకోత్తర లావణ్య భావం. చిన్మయ చైతన్యం, ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్యలీలలకు లలాటం లలనాస్థలి. ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది.
రావణునికి హనుమంతుడు జ్ఞానబోధ గావిస్తూ.. సీతాదేవి పరాశక్తి రూపమని, ఆమెను అవమానిస్తే లంక సర్వనాశ నమవుతుందని చెప్పడంలోని అంతరార్థం ప్రతి స్త్రీని మాతగా గౌరవించాలని తెలిపాడు. లలితాదేవిని ఉపాసిస్తే కుండలినీయోగసిద్ధి, స్వస్వరూప సంధానం కలిగి అమృతధారలు వర్షిస్తాయని భావిస్తారు.
Tags: Lalitha Tripura Sundariga as Durgamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *