Land acquisition for house construction

పక్కా గృహాల నిర్మాణాలకు భూ సేకరణ

– 11,496 వేల మంది లబ్ధిదారులు
– 135 ఎకరాల భూమి పంపిణీ

Date:12/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఉగాధి పండుగ రోజున పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పుంగనూరు, రూరల్‌ మండలం, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల , పులిచెర్ల మండలాల్లో భూసేకరణ పనులు పూర్తి కాబడింది. నియోజకవర్గంలో సుమారు 135 ఎకరాల ప్రభుత్వ భూమిలో 11,496 మంది లబ్దిదారులకు పక్కా గృహాలు నిర్మించే కార్యక్రమం ఉగ్యాధి పండుగ నుంచి ప్రారంభం కానున్నది. నవరత్నాలలోని 9వ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించేందుకు మంత్రి స్వీయపర్యవేక్షణలో అధికారులు సర్వం సిద్దం చేశారు. వివరాలిలా ఉన్నాయి.

పుంగనూరు మున్సిపాలిటిలో 3850 మంది లబ్ధిదారులకు భూమిని పంపిణీ చేసేందుకు పట్టణ సమీపంలోని నక్కబండలోని సర్వేనెంబరు 366, 365 లో గల 24 ఎకరాల భూమిని తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు ఆధ్వర్యంలో సేకరించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో లబ్ధిదారుల జాబితాను సిద్దం చేశారు. అలాగే మండలంలోని 16 పంచాయతీల్లో 208 మంది లబ్ధిదారులకు 10 ఎకరాల భూమిలో పట్టాలను పంపిణీ చేయనున్నారు. అలాగే 2592 మంది లబ్దిదారులకు తమ సొంత జాగాలలో గృహనిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఆధ్వర్యంలో జాబితాలను సిద్దం చేశారు. చౌడేపల్లె మండలంలో 5 పంచాయతీలలో 183 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరి కోసం చౌడేపల్లె, పెద్దకొండామర్రి, దిగువపల్లె, కాగతి, శెట్టిపేట పంచాయతీలలో ప్రభుత్వ లేఔట్లను ఏర్పాటు చేశారు. అలాగే మండలంలోని 2592 మంది లబ్దిదారులకు సొంత జాగాలు కలిగి ఉండటంతో ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. సోమల మండలంలో 767 మంది లబ్ధిదారులకు 25 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నారు. తిరుపతి ప్య్రధాన రహదారికి సమీపంలో సోమల మండల కేంద్రం దగ్గరగా ప్రభుత్వ భూమిని సేకరించారు. సదుం మండలంలోని 16 పంచాయతీలలో 133 మంది లబ్దిదారులకు 2.41 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు సిద్దం చేశారు. అలాగే 1106 మంది లబ్ధిదారులకు సొంత స్థలాలు కలిగి ఉండటంతో గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసేందుకు జాబితా సిద్దం చేశారు. అలాగే పులిచెర్ల మండలంలో 1800 మంది లభ్దిదారులను ఎంపిక చేశారు. వీరి కోసం 11.50 ఎకరాలు కేటాయించారు. ఇందులో 4.50 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందులో 1330 మందికి సొంత జాగాలు ఉండగా 470 మందికి ప్రభుత్వం భూమి , ఇండ్లు నిర్మించి ఇచ్చేలా జాబితా సిద్దమైంది. రొంపిచెర్ల మండలంలోని 8 పంచాయతీలలో 1857 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 932 మంది లబ్దిదారులకు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేయనున్నారు. 925 మంది లబ్ధిదారులకు సొంత స్థలాల్లో గృహ నిర్మాణాలు నిర్మించుకునేలా జాబితా సిద్దం చేశారు.

ఫలించని చంద్రబాబు వ్యూహాలు

Tags; Land acquisition for house construction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *