Natyam ad

ఆవులపల్లె రిజర్వాయర్‌ భూసేకరణ పూర్తి చేయాలి-కలెక్టర్‌ హరినారాయణ్‌

– దేశీయ ఆవుల ఉత్పత్తులను ప్రోత్సహించండి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నియోజకవర్గంలోని సోమల మండలంలో నిర్మిస్తున్న ఆవులపల్లె రిజర్వాయర్‌ పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని, అలాగే దేశీయ ఆవుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి ఆవులపల్లె, నేతిగుట్లపల్లె రిజర్వాయర్లకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సోమల మండలం ఆవులపల్లెలో రూ.672 కోట్లతో 3.5 టిఎంసీల నీటి నిల్వల కోసం రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రాగానిపల్లె, గూడూరుపల్లెలో జగనన్న కాలనీల కోసం కేటాయించిన 10 ఎకరాల భూమికి సంబంధించి అధికారులతో చర్చించారు. గృహనిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని తిమ్మికృష్ణాపురంలో రైతు హేమాని నిర్వహిస్తున్న దేశీయ ఆవుల డైరీని కలెక్టర్‌ పరిశీలించి , వెహోక్కలు నాటారు. వెటర్నరీశాఖ ద్వారా రూ.15 లక్షలు సబ్సిడి మంజూరు చేయడం జరిగిందని, ఈ ఉత్పత్తులు నెయ్యి, పాలు, పేడ, పిడకలను విక్రయించేలా ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డీవో శివయ్య, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, ఇరిగేషన్‌ డీఈలు ప్రసన్న, గణానాయక్‌, తహశీల్ధార్‌ సీతారామన్‌ తదితరులు పర్యటించారు.

Tags: Land acquisition of Avulapalle reservoir should be completed – Collector Harinarayan

 

Post Midle