భూ రికార్డులు కిరికిరి.. “రెవెన్యూ” కాసుల కక్కుర్తి పడి

-వరదయ్యపాలెంలో సంచలనం
-వెంటాడిన పాపం.. ఆర్డీవో పిర్యాదు.
-ఇద్దరు తహశీల్దార్లు, ఇద్దరు ఆరై లు.. ఇద్దరు వీఆర్వో లపై కేసు నమోదు.
 
వరదయ్య పాలెం ముచ్చట్లు:
 
వరదయ్య పాలెం మండలం చిన్నపాండూరు రెవెన్యూ లో (అపోలో పరిశ్రమ సెజ్ భూసేకరణ) ఎస్టీలకు ఇచ్చిన భూములను నిబంధనలకు విరుద్ధంగా. నోటీసులు ఇవ్వకుండా.. పాత పట్టాలను రద్దు చేయకుండా మరో ముగ్గురికి అక్రమ మార్గంలో పట్టాలు ఇచ్చిన విషయంలో ఆర్డీవో ఇచ్చిన పిర్యాదు మేరకు 2012-2015 కాలంలో పనిచేసిన ఇద్దరు తహశీల్దార్ లు.. ఇద్దరు ఆరై లు. ఇద్దరు వీఆర్వో లపై కేసు నమోదు చేశారు. రెండో సారి పట్టాలు పొందిన లబ్దిదారులు అపోలో భూపరిహరంలో కోర్టుకు వెళ్ళడం.. దీనిపై కోర్టు రెవెన్యూతీరుపై తప్పు పడుతూ జిల్లా కలెక్టర్ హాజరు కు ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. ఈ కుంభకోణం వెలుగు చూసింది. కేసు నమోదు అయిన తహశీల్దార్ మహదేవయ్య పదవి విరమణ కాగా.. బాబూరాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం గుడిపాల తహశీల్దార్ గా ఉన్నారు.ఆరై సదాశివం, మురళీమోహన్ పదవీ విరమణ పొందగా. VRO లు రఘునాథ రెడ్డి పదవి విరమణ కాగా వెంకట రమణయ్య ప్రస్తుతం మత్తెరి మిట్ట vro గా పని చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Land records are annoying

Natyam ad