పుంగనూరులో సిలిండర్ల పరిశ్రమకు భూమి కేటాయించాలి

– మంత్రిని కోరిన వ్యాపార వేత్తలు శ్రీనివాసులు, శ్రీసాయి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో సిలిండర్ల పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. మంగళవారం మదనపల్లెకు చెందిన గాయిత్రి సిలిండర్ల పరిశ్రమ నిర్వాహకులు జబ్బాల శ్రీనివాసులు, జబ్బాల శ్రీసాయిలు ఇద్దరు తిరుపతిలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమ ద్వారా 400 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. భూమి కేటాయింపు జరగగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

 

Tags: Land should be allocated for cylinder industry in Punganur

 

Leave A Reply

Your email address will not be published.